మంచు ఫ్యామిలీ తమ గొప్ప మనసు చాటుకున్నారు..

కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమ మూతపడింది. గత కొన్ని రోజులుగా షూటింగ్స్ ఆగిపోవడం తో ఇండస్ట్రీ నే నమ్ముకున్న సినీ కార్మికుల కష్టాలు అన్నీఇన్నీ కాదు..రోజు కూలి చేస్తే కానీ డొక్కాడని పరిస్థితిలో షూటింగ్స్ బంద్ కావడం తో వారి జీవిత రోడ్డున పడింది.

ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు చిత్ర సీమా నడుం బిగించింది. చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ చారిటి ద్వారా సినీ కార్మికులను ఆదుకునే పని చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఛారిటీకి చాలామంది సినీ ప్రముఖులు తమవంతు వైరల్ అందజేయగా తాజాగా మోహన్ బాబు ఫ్యామిలీ మరోసారి ముందుకు వచ్చి తమ గొప్ప మనసు చాటుకున్నారు. మోహన్ బాబు – విష్ణు కలిసి కరోనా బాధితులను ఆదుకోవడంలో తమ వంతు బాధ్యతగా ఎనిమిది గ్రామాలను దత్తత తీసుకున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి ప్రాంతంలోని ఎనిమిది గ్రామాలను దత్తత తీసుకొని గ్రామస్థుల అవసరాలను తీరుస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఆ గ్రామాలలోని పేదవారికి డైలీ రెండు పూటలా భోజనం పెట్టి వారి ఆకలిని తీరుస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వారంతా మోహన్ బాబు ఫ్యామిలీ గొప్ప తనం గురించి గొప్ప గా చెపుతున్నారు.