23 రోజుల పసి బిడ్డకు కరోనా..మహబూబ్‌నగర్‌లో దారుణం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు ఎక్కువ అవుతుంది. మొదట్లో కాస్త తగ్గినట్లే అనిపించినప్పటికీ ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి కారణంగా ఒక్కసారిగా రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరగడం స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం 400 కు చేరువ లో ఉండగా మహబూబ్‌నగర్‌లో 23 రోజుల పసి బిడ్డకు కరోనా పాజిటివ్ రావడం అందర్నీ షాక్ లో పడేస్తుంది.

ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ వెంకట్రావు మంగళవారం తెలిపారు. 23 రోజుల పసి బిడ్డకు కరోనా పాజిటివ్ అని తేలిందని వివరించారు. అంతేకాక, మర్కజ్‌కు వెళ్లొచ్చినవారి ద్వారా కొత్తగా మరో ముగ్గురికి కూడా కరోనా సోకినట్టు ఆయన తెలిపారు. మహబూబ్‌నగర్‌లో నిన్నటివరకు ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా మరో ముగ్గురికి కరోనా సోకడం తో మొత్తం 9 కి చేరినట్లు తెలిపారు.