కరోనా వైరస్‌కు సంబంధించి ఎప్పుడు ఏ దుర్వార్త బయటికి వస్తుందో.. ఏ ఆందోళనకర సమాచారాన్ని వినాల్సి వస్తుందో అని భయపడిపోతున్నారు జనం. రోజూ ప్రతికూల వార్తలే తప్ప.. సానుకూలమైనవి ఏవీ బయటికి రావట్లేదు. ఇలాంటి సమయంలో తెలంగాణలో కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు చర్యల్లో భాగంగా హైదరాబాద్, గచ్చిబౌలీలో 1500 పడకల ‘కోవిడ్’ ఆసుపత్రిని సిద్ధం చేసింది.
ఈ విషయాన్ని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ టవర్ లో ఏర్పాటు చేసిన ఈ ఆసుపత్రిని మంత్రి కేటీఆర్, వైద్యాధికారులు, ఈటల కలిసి ఈ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, మరో 22 వైద్యకళాశాలల ఆసుపత్రులను కూడా కోవిడ్ హాస్పిట్సల్ గా మార్చామని చెప్పారు. ‘కరోనా’ కట్టడికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు.