ఏపీ లోకి ఆక్టోపస్ బలగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు విపరీతం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 300 కు పైగా కేసులు నమోదు కావడం తో ప్రభుత్వం ఇంకాస్త ప్రజలను అలర్ట్ చేస్తుంది. ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తున్నప్పటికీ ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి మూలంగా కరోనా కేసులు పెరిగిపోతుండటం తో లాక్ డౌన్ విషయంలో ఇంకాస్త కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇందుకోసం జగన్ మూడంచెల వ్యూహం అమలు చేస్తున్నాడు. గుంటూరు, కర్నూల్ లో కేసులు ఎక్కువ నమోదవుతున్న తరుణంలో నగరంలో కఠిన నిబంధనలను అమలుచేయడానికి ఆక్టోపస్ బలగాలను రప్పించినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా పాజిటివ్ నమోదైన ప్రాంతాల్లో 4 ప్లాటూన్ ల ఏపీఎస్పీ బలగాలను వినియోగిస్తున్నట్టు చెప్పారు. ఆయా ప్రాంతాలలో విధి నిర్వహణ చేస్తున్న సిబ్బంది విషయంలో పూర్తి జాగ్రత్తలు పాటిస్తున్నామన్నారు. మరో వైపు 6 నుండి 11వరకు ప్రజలకు ఇచ్చిన సమయాన్ని జగ్రత్తగా వాడుకోవాలన్నారు. ఆ సమయంలో వాకింగ్, జాగింగ్ లాంటివి చేయొద్దని ఇంటికి రెండు కిలోమీటర్ల లోపే అన్ని సరుకులు తీసుకోవాలని జగన్ తెలిపారు.