కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవడానికి హీరో గోపీచంద్ ముందుకొచ్చారు. 1000కిపైగా పేద కుటుంబాలకు నెలకు సరిపడా సరకులు, నిత్యావసరాల్ని పంపిణీ చేశారు. ఆయనే స్వయంగా వీటిని పేదలకు అందించారు.
ఇదీలావుంటే కరోనా వైరస్‌పై పోరుకు ప్రముఖ నటుడు కృష్ణంరాజు కుమార్తెలు ప్రదీప్తి, ప్రసీద, ప్రకీర్తి తమవంతు సాయం చేశారు. ముగ్గురూ కలిసి తమ పాకెట్ మనీ నుంచి రూ.2 లక్షలు చొప్పున పీఎం-కేర్స్‌కు రూ.6 లక్షలు విరాళం అందించారు.