భారత్ లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఐసీఎంఆర్‌ కీలక ప్రకటన చేసింది

భారత దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు విపరీతం అవుతున్నాయి. ప్రస్తుతం 5 వేలకు చేరువ లో ఉండడం తో ఐసీఎంఆర్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రోజుకి లక్ష మందికి పరీక్షలు చేసే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ప్రణాళికలు వేసుకుంటున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. కరోనాను ఎదుర్కొనేందుకు పలు ఆవిష్కరణలకు కృషి చేస్తున్నట్లు చెప్పింది. పీసీఆర్‌ మిషన్ల ద్వారా పరీక్షలు జరిపేందుకు ఇప్పటికి 200 పబ్లిక్‌, ప్రైవేటు ల్యాబులకు అనుమతులిచ్చింది.

పాజిటివ్ కేసులు ఎక్కడైతే వచ్చాయో ఆయా ప్రాంతాల్లో ప్రతీ రోజు సర్వే నిర్వహించాలని, అనుమానితులకు తప్పని సరిగా పరీక్షలు నిర్వహించాలని అధికారులు సిద్ధమవుతున్నారు. కోవిడ్ పరీక్షల కోసం ప్రభుత్వ, ప్రైవేట్‌కు చెందిన ల్యాబ్స్‌ను, రిసెర్చ్ ఇనిస్టిట్యూట్స్, మెడికల్ కాలేజీలను గుర్తిస్తున్నామన్నారు. ఏవైతే… కోవిడ్ పరీక్షలకు అనువైన ప్రాంతాలుగా ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.