హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతిపై నిషేధం ఎత్తివేత

మలేరియా నివారణకు ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఎగుమతిపై విధించిన ఆంక్షలను భారత్‌కు పాక్షికంగా ఎత్తివేయనుంది. కరోనా చికిత్స కోసం ప్రపంచ దేశాల నుంచి హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ఔషధానికి డిమాండ్‌ పెరుగుతోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు తమ దేశానికి క్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లను ఎగుమతి చేయాలని ప్రధాని మోదీని కోరిన విషయం తెలిసిందే.

దీని ఎగుమతులపై భారత్‌ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఒత్తిడి ఎక్కువవుతోంది. కరోనా ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో భారత్‌ పెద్దమనసుతో వ్యవహరించింది.

మానవతా దృక్పథంతో క్లోరోక్విన్‌ సహా అవసరమైన ఇతర ఔషధాల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని పాక్షికంగా ఎత్తివేస్తున్నట్లు విదేశాంగశాఖ ప్రకటించింది. ఆయా దేశాలకు అససరమైన మేర కొన్ని రకాల మందుల్ని సరఫరా చేసేందుకు అంగీకరించింది.