భారత్ పై రివెంజ్ అంటున్న ట్రంప్


కరోనా వైరస్ ప్రభావానికి అగ్రరాజ్యం అమెరికా ఉక్కిరి బిక్కిరి అవుతోంది. అమెరికాలో ఇప్పటి వరకు 3,11,357 మంది వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 8,438 మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్‌ చికిత్సలో ప్రభావం చూపుతుందని భావిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందుల్ని తమ దేశానికి ఎగుమతి చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరారు.

కొవిడ్‌-19 రోగులకు చికిత్స చేయడం కోసం హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రల్ని సరఫరా చేయాలన్న అమెరికా విజ్ఞప్తిని భారత్‌ మన్నించకపోతే అది తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తుందని అన్నారు. అమెరికాతో భారత్‌ ఎప్పుడూ సరైన రీతిలోనే వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘‘ మోడీ తో మాట్లాడాను. క్లోరోక్విన్‌ అవసరాన్ని వివరించాను. అమెరికాకు సరఫరా చేయాలని కోరాను. ఒకవేళ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయకపోతే.. చూద్దాం. కానీ, దానికి ప్రతీకారం ఉండొచ్చు” ట్రంప్‌ వ్యాఖ్యానించారు.