ఏపీ మంత్రికి కరోనా టెస్ట్..రిపోర్ట్ ఏం తేలిందంటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు విపరీతం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 300 కు పైగా కేసులు నమోదు కావడం తో ప్రభుత్వం ఇంకాస్త ప్రజలను అలర్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు కరోనా టెస్ట్ చేయించుకున్నారు.

కరోనా పాజిటివ్ వచ్చిన వైద్యుడిని కలవడం తో అనిల్ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. 36 గంటల పాటు స్వీయ నిర్భందంలోఉన్న అనిల్… టెస్టులు చేయించుకోగా, నెగటివ్ రిజల్ట్స్ వచ్చింది. దీంతో నేటి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం ఆయన స్వాబ్‌ తీసి టెస్టింగ్‌ నిమిత్తం స్విమ్స్‌కు పంపారు. సోమవారం సాయంత్రానికి నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చింది. దీంతో తిరిగి కరోనా అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాలని మంత్రి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.