ఓ పక్క కరోనా వైరస్ రోజు రోజుకు విపరీతం అవుతుంటే ప్రజలు భయాందోళలకు గురి అవుతున్నారు. ఈ కరోనా ను ఎలా కట్టడి చేయాలా అని అంత తలలు పట్టుకుంటున్నారు. ఇది ఇలా ఉంటె బాయ్ ఫ్రెండ్ ను కలిసేందుకు పర్మిషన్ ఇవ్వాలంటూ ఓ యువతీ పోలీస్ స్టేషన్ లో హల్చల్ చేయడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఓ యువతి తన బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి పర్మిషన్ కావాలంటూ కోరింది. దాంతో ఏం చేయాలో తెలియక పోలీసులు తల పట్టుకున్నారు. కాగా అంతకు ముందు రోజే ఆ యువకుడు అమ్మాయి ఇది దగ్గరికి రాగా అమ్మాయి తల్లి తండ్రులు తమ కూతురును వేదిస్తానున్నాడని కేసు పెట్టారు. పోలీసులు విచారించగా ఆ అమ్మాయిని ప్రేమించట్లేదని అది చెప్పడానికే ఇంటికి వచ్చానని తెలిపాడు. ఇప్పుడు ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ను కలవడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందే అంటూ స్టేషన్ ముందు బైఠాయించింది. దీంతో పోలీసులు ఆమెకు నచ్చ జెప్పి అక్కడి నుండి ఇంటికి పంపించారు.