ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 76శాతం పురుషులే ఉన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,067కి చేరింది.
గడిచిన 24 గంటల్లో 693 పాజిటివ్ కేసులు నమోదు అవ్వడంతో పాటు 30 మంది వైరస్ బాధితులు మృతి చెందారు. ఈ మేరకు అగర్వాల్ ఓ ప్రకటక విడుదల చేశారు.
మరోవైపు దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రూ.1100 కోట్లు విడుదల చేసినట్లు ప్రకటించారు. మరో మూడువేల కోట్లు రాష్ట్రాలకు కేటాయిస్తామని తెలిపారు.