బండ్ల గణేష్ దండాలు పెట్టాడు

బండ్ల గణేష్ ఈ పేరు మీడియాలో ఎప్పుడు వైరలే..సినిమా ఫంక్షన్ లో ఈయన మాటలైనా..రాజకీయ మాటలైనా సరే ఆయన మాట్లాడాడంటే అది వైరల్ కావాల్సిందే. ఈ మధ్య 7 ఓ క్లోక్ బ్లెడ్ తో ఫుల్ పాపులర్ అయినా గణేష్..తాజాగా కోడి ముద్దు తో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ వార్త రెండు రోజుల క్రితం వరకు మీడియా చక్కర్లు కొట్టింది. ఇప్పుడు కోడి గుడ్డు ధర చూసి బోరుమన్నారు.

కొండెక్కిన గుడ్డు ధర.. మార్కెట్‌లో రూ. 6. నిన్న మొన్నటి వరకూ రూ. 3 ఉన్న కోడిగుడ్డు ధర అమాంతంగా రెట్టింపు ధర పలుకుతోంది. చికెన్, కోడుగుడ్లుతో కరోనా రాదంటూ ప్రభుత్వాలు సైతం ప్రచారం చేయడంతో ప్రజల్లో చైతన్యం వచ్చేసి గుడ్లు, చికెన్‌ని విపరీతంగా కొనేస్తున్నారని దీంతో రేట్లు భారీగా పెరిగిపోయాయని ఓ వార్తా పత్రికలో రావడం తో గణేష్ ఈ వార్త ఫై స్పందించారు.

కొండెక్కిన కోడిగుడ్డు ధర అని ఈరోజు ప్రముఖ దిన పత్రికలో చదివాను.. కోళ్ల పరిశ్రమ అంటే చికెన్ కి సంబంధించిన కోడి కాదు కోడి రైతు అంటే కోడిగుడ్లు అమ్ముకునే వాడని రైతు అంటారు, కోట్ల నష్టాల్లో లేయర్ కోడి రైతు గుడ్డు పెట్టి ఇచ్చే పత్తి కోడి రైతు కష్టాల్లోనే ఉన్నారు ఈరోజు మా ఉత్పత్తి ధర నాలుగు రూపాయల 20 పైసలు అవుతుంది. మాకు మాత్రం రెండు రూపాయల ఎనభై పైసల నుంచి మూడు రూపాయలు మాత్రమే వస్తుంది మా నష్టాన్ని దయచేసి అర్థం చేసుకోండి మమ్మల్ని కాపాడటానికి ప్రయత్నించండి’ అంటూ దండాలు పెడుతూ వరుస ట్వీట్లు చేశారు.