ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాక్ష్న మండిపడ్డారు. హిందూ దేవాలయాల్ని క్వారంటైన్ కేంద్రాలుగా మార్చడంపై కన్నా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదో దుర్మార్గమైన ఆలోచన అన్నారు.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కాణిపాకం దేవాలయాల్లో క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
కోట్లాది మంది ఆరాధించే దేవాలయాలను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చాలనుకోవడం శోచనమీయమని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు.