2500 కోచ్‌లను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చిన రైల్వే

కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడమే లక్ష్యంగా ఆ మహమ్మారి బారిన పడినవారి వారికి చికిత్స అందించేందుకు ఇప్పటివరకు 2500 కోచ్‌లను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చినట్టు భారతీయ రైల్వే సంస్థ ప్రకటించింది. ఈ కోచ్‌లలో మొత్తం 40వేల ఐసోలేషన్‌ పడకలను సిద్ధం చేసినట్టు తెలిపింది. రోజుకు సగటును 375 కోచ్‌లను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మారుస్తున్నట్టు రైల్వే సంస్థ వెల్లడించింది.

కాగా కరోనా నిర్ధారణ పరీక్షల కోసం భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్‌) యాంటీ బాడీ టెస్టు కిట్లను సిద్ధం చేస్తోంది. ఈ నెల 8 నాటికి ఈ కిట్లు సిద్ధమవుతాయని వెల్లడించింది. హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో కరోనా పరీక్షలకు ఈ కిట్లను వినియోగించనున్నారు. మొత్తం 7లక్షల యాంటీబాడీ టెస్టు కిట్లు రానున్నట్టు తెలిపింది.