కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారత్‌కు అమెరికా సాయం ప్రకటించింది. భారత్‌కు 2.9 మిలియన్ డాలర్లు ఇవ్వనున్నట్టు అమెరికా వెల్లడించింది. యూఎస్ ఎయిడ్ సంస్థ ద్వారా ఈ ఆర్థిక సహకారం అందజేస్తున్నట్టు తెలిపింది. మరోవైపు, కరోనా మహమ్మారి అమెరికాలో మృత్యునాదం చేస్తోంది. ప్రపంచంలో అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదు కాగా, దాదాపు 9,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
భారత్‌కు ప్రకటించిన నిధులతో లేబరేటరీ వ్యవస్థలు, కరోనా సోకిన వ్యక్తుల గుర్తింపు, బాధితులపై నిరంతర పర్యవేక్షణ, ఇతర సాంకేతిక సదుపాయాలను సమకూర్చుకోవాలని సూచించింది.
మన పొరుగు దేశాలైన శ్రీలంకకు 1.3 మిలియన్ డాలర్లు, నేపాల్‌కు 1.8 మిలియన్ డాలర్లు, బంగ్లాదేశ్‌కు 3.4 మిలియన్ డాలర్లు, అఫ్ఘానిస్థాన్‌కు 5 మిలియన్ డాలర్లు కేటాయించారు.