ఆసుపత్రి నుండి పారిపోయిన కరోనా రోగి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకు ఎంతగా పెరిగిపోతున్నాయో తెలియంది కాదు..ఈ కేసులను ఎలా కట్టడి చేయాలా అని ప్రభుత్వం , అధికారులు తలలు పట్టుకునున్నారు. ఇదిలా ఉంటె కరోనా సోకినా రోగులు మాత్రం కొత్త తలనొప్పులు తెస్తున్నారు. హాయిగా హాస్పటల్ లో చికిత్స తీసుకోవాలని అంటే వారు మాత్రం డాక్టర్స్ కళ్లుగప్పి పారిపోతున్నారు.

తాజాగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ కరోనా రోగి.. ఆస్పత్రి సిబ్బంది కళ్లుగప్పి పారిపోయాడు. గద్వాలకు చెందిన ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో కొద్ది రోజుల కిందట గాంధీ ఆసుపత్రిలో చేరాడు. వైద్యులు అతడిని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఆదివారం (ఏప్రిల్ 5) రాత్రి అతడు అందరి కళ్లుగప్పి ఆస్పత్రి నుంచి పరారయ్యాడు. కరోనా పెషెంట్ పారిపోయిన విషయం గుర్తించిన గాంధీ ఆస్పత్రి సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.