రష్మీ పాట పాడి..మండి పడింది

యాంకర్ రష్మీ సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ సమాజ సేవ పట్ల ముందుటుందనే సంగతి తెలిసిందే. తాజాగా కరోనా మహమ్మారి ఫై రష్మీ సాయం చేసి వార్తల్లో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న వాటికీ తమవంతు గా విరాళంగా రూ. 25 వేల సహాయాన్ని PMcares కు విరాళంగా ఇచ్చి తన గొప్ప మనసు చాటుకుంది.

నిన్న ఆదివారం మోడీ పిలుపు మేరకు క్యాండిల్ వెలిగించింది. అయితే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయినా గో కరోనా పాట పాడింది రష్మీ. రాత్రి చాలామంది క్యాండిల్స్, దీపాలు వెలిగిస్తే… మరికొందరు బాణాసంచా కాల్చారు. దీనిపై రష్మీ మండిపడింది. ప్రధాని మనల్ని దీపాలు, క్యాండిల్స్ మాత్రమే వెలిగించమన్నారంది. పటాకులు కాల్చమని ఎవరూ చెప్పలేదు. బాణసంచా కాల్చడానికి ఇది దీపావళి పండగ కాదంది. భగవంతుడు ఈ ప్రజల్ని నువ్వే మార్చాలంటూ రష్మీ అసహనం వ్యక్తం చేసింది.