లాక్ డౌన్ సమయంలో రెవెన్యూ అధికారులు పట్టపగలే మందు వేస్తూ చిందేశారు..

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ ప్రకటన వచ్చిన దగ్గరి నుండి మెడికల్ షాప్స్ , కిరాణా షాప్స్ , హాస్పటల్ , నిత్యా అవసరాల షాప్స్ , చికెన్ , మటన్ షాప్స్ తప్ప అన్ని బంద్ అయ్యాయి. పోలీస్లు , డాక్టర్స్ 24 గంటలు ప్రజల కోసం కష్టపడుతున్నారు. ఇలాంటి టైం లో రెవెన్యూ అధికారులు కలిసి పట్టపగలు మందేస్తూ చిందులు వేయడం అందర్నీ షాక్ లో పడేసింది.

ఈ ఘటన హైదరాబాద్ నగర శివారులో రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గు మండలంలో చోటుచేసుకుంది. కొందుర్గు మండలంలో రెండు మూడు గ్రామాలకు చెందిన వీర్వోలు, వీఆర్ఏలు మరో ఇద్దరు అధికారులు కలిసి పట్ట పగలే విధుల్లో ఉన్న సమయంలోనే ఓ గదిలో కూర్చొని మద్యం సేవిస్తున్నారు. మెడలో ఐడెంటిటీ కార్డులు వేసుకొని మరీ దర్జాగా మందేస్తుండడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. స్థానికుడు ఒకరు రెవెన్యూ అధికారులను ఏవో విషయాల గురించి మాట్లాడుతూ, రహస్యంగా తన సెల్ ఫోన్‌లో ఆ వీడియో చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది. ఈ వీడియో చూసిన మందు బాబులు గత 15 రోజులుగా వైన్ షాప్స్ బంద్ కదా..వీరికి మందు ఎక్కడ దొరికిందని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.