కరోనా ఫై ఆరా తీసిన కేసీఆర్..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం (ఏప్రిల్ 5) మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో కరోనా ఫై అధికారులతో సమీక్షా నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ ఎలా ఉంది..ఏ ఏ జిల్లాల్లో ఎంత ఎక్కువ గా ఉంది..పాజిటివ్‌ కేసుల నమోదు, నియంత్రణ చర్యలపై..మర్కజ్‌ భవన్‌లో ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి సంబంధించిన వారికీ సంబందించిన కరోనా టెస్ట్ లు ఇలా ప్రతి దాని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

లాక్‌డౌన్ నేపథ్యంలో పేదలు, వలస కార్మికులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరకులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం సాగుతున్న తీరుపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ఈ సమీక్షా లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు.