ఇప్పటివరకు మనదేశం లో ఎన్ని కరోనా కేసులు నమోదు అయ్యాయో తెలుసా..?

ఇండియా లో రోజు రోజుకు కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. కేంద్రం మందు జాగ్రత్తగానే 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇంటికే పరిమితం చేసినప్పటికీ కొంతమంది విదేశీయుల రాకతో దేశంలో వైరస్ సంఖ్య పెరుగుతుంది.

దేశంలో మొత్తం 3374 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో 274 జిల్లాలలో కరోనా వైరస్ ప్రభావం ఉందని ఆయన తెలిపారు. నిన్న ఒక్కరోజే 472 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు. దేశం మొత్తం మీద 79 మంది కరోనా వలన చనిపోయారని, వీరిలో శనివారం ఒక్కరోజే 11 మంది చనిపోయినట్లు ఆయన వెల్లడించారు.