ఏపీలో ఇంకా పెరుగుతున్న కరోనా కేసులు

ఏపీలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 190కి చేరింది. ఈ రోజు మరో 10 కరోనా కేసులు నిర్ధారించినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై బులెటిన్‌ విడుదల చేసింది.

ఇదీవుంటే దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విపక్షాలతో సమావేశం నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఈ మేరకు ఆయన పార్లమెంటరీ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడనున్నారు. ఉభయ సభల్లో కలిపి ఐదుగురికి మించి సభ్యులు ఉన్న అన్ని పార్టీల నేతలతో ఈ నెల 8న ఉదయం 11గంటలకు ప్రధాని మాట్లాడనున్నారు .