కరోనా మహమ్మారి దేశం మొత్తం లాక్ డౌన్ చేసిన గాని రోజు రోజుకు పెంచుకుంటూ పోతుంది. గత 15 రోజులుగా ప్రజలంతా ఇంటికే పరిమితం అయినప్పటికీ కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఓ పిలుపును ఇచ్చారు.
ఏప్రిల్ 5వ తేదీన.. 130 కోట్ల మంది ప్రజలు మహాశక్తి జాగరణ చేయాలన్నారు. దేశ ప్రజలు మహాసంకల్పాన్ని ప్రదర్శించాలన్నారు. ఆ రోజు రాత్రి 9 గంటలకు ప్రతి ఒక్కరూ ఇంట్లో లైట్లు బంద్ చేసి.. దీపాలను వెలిగించాలన్నారు. కేవలం 9 నిమిషాల సమయాన్ని కేటాయించాలన్నారు. టార్చ్‌లైట్ అయినా.. దీపం అయినా వెలిగించాలన్నారు.
మోదీ పిలుపు కు అన్ని వైపుల నుంచి మద్దతు లబిస్తుంటే మక్కల్ నీది మయ్యమ్ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ తన ట్విట్టర్ ద్వారా మోదీ కామెంట్స్ పై మండిపడ్డారు. అందరం విపత్కర పరిస్థితులపై దిశా నిర్ధేశం చేస్తారని ఊహించాం. పేదలకి జీవనాధారం, ఆర్ధిక మాంద్యం, వస్తువుల లభ్యత గురించి మాట్లాడుతారని అనుకున్నాం. కాని మేమెప్పుడో ప్రారంభించిన టార్చ్‌లైట్ పోరాటం గురించి మాట్లాడారు అని తన ట్వీట్లో పేర్కొన్నారు.