లాక్ డౌన్ కారణంగా చిత్రసీమకు కోలుకోలేని దెబ్బ తగిలింది. షూటింగ్స్ బంద్ కావడం తో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగులో భారీ చిత్రంగా తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రానికి భారీ దెబ్బ పడింది. దీంతో చిత్రం గురించి అనేక పుకార్లు బయటకొచ్చాయి. హీరోయిన్ అలియా భట్ తప్పుకుందని..రాజమౌళి – దానయ్య మధ్య విభేదాలు వచ్చాయని అనేక రకాల వార్తలు ప్రచారం అవుతుండగా..వాటిపై నిర్మాత దానయ్య క్లారిటీ ఇచ్చారు .
పక్కా ప్రణాళికతో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్డ్ ప్లాన్ చేశాం అని.. ఆ షెడ్యూల్ ప్రకారమే షూటింగ్ నడుస్తుందన్నారు. నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ గండిపేటలో వేసిన ప్రత్యేకమైన సెట్స్‌లో జరుగుతుందని అనంతరం పూణెలో నెక్స్ట్ షెడ్యూల్ ఉందన్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తైందని పూణె షెడ్యూల్లో బాలీవుడ్ హీరోయిన్ ఆలియ భట్ జాయిన్ అవుతుందని తెలిపారు.
అలాగే అలియా ఇచ్చిన డేట్స్ ప్రకారం ఏప్రిల్ నెలలోనే షూటింగ్ చేయాల్సి ఉందని అయితే లాక్ డౌన్ నేపథ్యంలో డేట్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పూణే తరువాత యూనిట్ మొత్తం డెహ్రాడూన్ వెళ్తుందనే అక్కడే ఏకధాటిగా షూటింగ్ జరుగుతుందని దానయ్య తెలిపారు.