ఏపీ ముఖ్యమంత్రి జగన్, పోలీసులకు లైట్ గా క్లాస్ పీకారు. పోలీసులపై పని ఒత్తిడి ఉందని అంగీకరిస్తున్నానని, అదే సమయంలో వారు ఉపయోగించే భాష, కౌన్సెలింగ్ ఇచ్చే పద్ధతీ ముఖ్యమని అన్నారు.
కరోనా నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించే వారిపై పోలీసుల తీరు మారాలని ఆదేశించారు. పోలీసులు అనుసరించాల్సిన విధానంపై దృష్టి పెట్టాలన్నారు. కరోనా నియంత్రణ చర్యలపై నిర్వహించిన సమీక్షలో ఆయనీ విషయం ప్రస్తావించారు.
పోలీసులపై పని ఒత్తిడి ఉందని అంగీకరిస్తున్నానని, అదే సమయంలో వారు ఉపయోగించే భాష, కౌన్సెలింగ్ ఇచ్చే పద్ధతీ ముఖ్యమని చెప్పారు. బాపట్ల యువకుడి ఆత్మహత్య కేసులో విచారణకు ఆదేశించారు.