‘ఫిదా’ తో అందర్నీ ఫిదా చేసిన శేఖర్ కమ్ముల..కాస్త గ్యాప్ తర్వాత నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా పెట్టి లవ్ స్టోరీ అనే ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. ఫిదా తర్వాత శేఖర్ ఈ సినిమా చేయడం..అందులోనూ సాయి పల్లవి , నాగ చైతన్య లు నటించడం తో ఈ మూవీ ఫై అందరిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. దీంతో ఈ మూవీ రైట్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడుతుందట.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ ఓవర్సీస్ హక్కులు చైతూ గత సినిమాలన్నింటికంటే భారీ ధర పలుకుతున్నట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్స్ గా ఇప్పటి వరకూ వందలాది సినిమాలను విడుదల చేసిన ఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ సినిమాతో ఫస్ట్ టైమ్ నిర్మాణ రంగంలోకి దిగుతోంది. కాగా నారాయణదాస్ నారంగ్, ఎఫ్.డి.సి చైర్మైన్ రామ్మోహనరావు ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ సినిమా పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి.