రిచా మనసులో ప్రభాస్


‘మిర్చి’ ఫేం రిచా గంగోపాధ్యాయ లైవ్ లోకి వచ్చారు. కరోనాను ఉద్దేశిస్తూ.. మిమ్మల్ని మీరు రీఛార్జ్‌ చేసుకోవడానికి ఏం చేస్తున్నారు’ అని ఫాలోవర్స్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. దీనికి ఓ నెటిజన్‌.. ‘మేడమ్‌ ప్రభాస్‌ గురించి ఒక్కమాట చెప్పండి”అని ట్వీట్ చేశారు

దీనికి రిచా స్పందిస్తూ.. ‘ప్రభాస్‌ నిజంగా ఓ అద్భుతమైన వ్యక్తి. చాలా వినయంగా ఉంటారు. నాకిష్టమైన సహ నటుల్లో ఆయనొకరు’ అని చెప్పారు. రిచా సినిమాలకి దూరం అయిపోయిన సంగతి తెలిసిందే. ఆమెకు పెళ్లి కూడా జరిగింది. ఇప్పుడు భర్తతో కలసి విదేశాల్లో వుంది రిచా.