లాక్ డౌన్ ని అతిక్రమించిన విజయ్

తమిళ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి లాక్ డౌన్ ని అతిక్రమించారు. దిని వెనుక కారణం వుంది. తమిళనాడుకు చెందిన సీనియర్‌ పాత్రికేయుడు, రచయిత నెల్లాయ్‌ భారతి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

తమిళ హీరో విజయ్‌ సేతుపతి భారతి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించినప్పటికీ ఆయన భారతి ఇంటికి వెళ్లి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. అంతేకాదు ఆర్థికసాయం పెద్ద మనసు చాటుకున్నారు. అంత్యక్రియల ఖర్చు కూడా ఆయనే భరించారు. నెల్లాయ్‌ భారతి కి విజయ్ కి మంచి అనుబంధం వుంది.