అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి మృత్యు రూపం దాల్చింది. నిన్న ఒక్కరోజే ఆ దేశంలో రికార్డు స్థాయిలో 1480 మంది మరణించినట్లు జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటి ట్రాకర్ వెల్లడించింది.
గురువారం రాత్రి 8:30 గంటల నుంచి శుక్రవారం రాత్రి అదే సమయానికి 1480 మంది మరణించారని గుర్తించింది. దీన్నిబట్టి అమెరికాలో వైరస్ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో ఇప్పటివరకు అగ్రరాజ్యంలో మృతిచెందినవారి సంఖ్య 7,406కి చేరింది. బాధితుల సంఖ్య 2,77,828గా నమోదైంది.
అమెరికాలో ఒక పక్క మరణాల సంఖ్య పెరుగుతుండగా మరోపక్క బాధితుల సంఖ్య కూడా అంతకంతకూ అధికమవుతోంది. ఈ నేపథ్యంలో దేశ ప్రజలు మరో నాలుగు వారాల పాటు ఇళ్లకే పరిమితవ్వాలని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే సూచించారు.