కరోనా మహమ్మారి దేశం మొత్తం లాక్ డౌన్ చేసిన గాని రోజు రోజుకు పెంచుకుంటూ పోతుంది. గత 15 రోజులుగా ప్రజలంతా ఇంటికే పరిమితం అయినప్పటికీ కరోనా కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ దేశ ప్రజలకు ఓ పిలుపును ఇచ్చారు.
ఏప్రిల్ 5వ తేదీన.. 130 కోట్ల మంది ప్రజలు మహాశక్తి జాగరణ చేయాలన్నారు. దేశ ప్రజలు మహాసంకల్పాన్ని ప్రదర్శించాలన్నారు. ఆ రోజు రాత్రి 9 గంటలకు ప్రతి ఒక్కరూ ఇంట్లో లైట్లు బంద్ చేసి.. దీపాలను వెలిగించాలన్నారు. కేవలం 9 నిమిషాల సమయాన్ని కేటాయించాలన్నారు. టార్చ్‌లైట్ అయినా.. దీపం అయినా వెలిగించాలన్నారు.
మోదీ పిలుపు కు అన్ని వైపుల నుంచి మద్దతు లభిస్తోంది. జనతా కర్ఫ్యూ మాదిరిగానే ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని పలువురు ప్రముఖులు ప్రజలను కోరుతున్నారు. వీరిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ప్రధాన మంత్రి పిలుపును ప్రతి ఒక్కరూ గౌరవించాలని చిరంజీవి తెలుగు రాష్ట్రాల ప్రజలను కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. ‘‘మన ప్రియమత ప్రధాన మంత్రి పిలుపును గౌరవిస్తూ ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు మనమంతా దివ్వెలను వెలిగించి కరోనా వల్ల ఏర్పడిన చీకటిని తరిమికొడదాం. మన దేశం ఒక్కటవుదాం, మనం ఒకరికోసం ఒకరం నిలబడతామని పునరుద్ఘాటిద్దాం’’ అని చిరంజీవి తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
On #5thApr20 @9 PM for 9 minutes, respecting our beloved PM’s call, let us all light lamps to drive away the darkness and gloom of #Corona Let’s stand for our country and let’s reiterate that we stand for each other! #LightForIndia#StayHomeStaySafe#Sathakotideepotsavam
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 3, 2020