ఏమైంది ఈ వేళా చిత్రం తో దర్శకుడి గా ఇండస్ట్రీ కి పరిచమైన సంపత్ నంది..మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని యూత్ కు దగ్గర అయ్యాడు. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రచ్చ చేసి రచ్చ లేపాడు. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో ఓ సినిమా చేస్తాడని ఉహించాడు కానీ అది మిస్ అయ్యింది.
2015 లో బెంగాల్ టైగర్ చిత్రం తో ఆకట్టుకున్న ఈయన..ప్రస్తుతం మ్యాచోస్టార్ గోపీచంద్ సిటీమార్ చిత్రం చేస్తున్నాడు. ఈ సంగతి పక్కన పెడితే కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమ మూతపడింది. గత కొన్ని రోజులుగా షూటింగ్స్ ఆగిపోవడం తో ఇండస్ట్రీ నే నమ్ముకున్న సినీ కార్మికుల కష్టాలు అన్నీఇన్నీ కాదు..రోజు కూలి చేస్తే కానీ డొక్కాడని పరిస్థితిలో షూటింగ్స్ బంద్ కావడం తో వారి జీవిత రోడ్డున పడింది.
ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు చిత్ర సీమా నడుం బిగించింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆర్ధిక సాయాన్ని అందజేస్తుండగా..తాజాగా మెగాస్టార్ చిరంజీవి మనకోసం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ చారిటి ద్వారా సినీ కార్మికులను ఆదుకునే పని చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది తమవంతు సాయం ప్రకటించగా తాజాగా సంపత్ నంది 5 లక్షల సాయం అందజేశారు.