కరోనా నుండి కోలుకున్న సింగర్


కొవిడ్‌-19 నుంచి తాను పూర్తిగా కోలుకున్నానని అమెరికన్‌ సింగర్‌ సారా బరేలిన్‌ తెలిపారు. ‘నాకు కరోనా పాజిటివ్‌ ఉన్న విషయం మీకు తెలిసిందే. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నాను. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న వారిందరి గురించి నేను ఆలోచిస్తున్నాను. వారు త్వరగా కోలుకోవాలని, మంచిగా జీవించాలని ఆశిస్తున్నాను.’ అని సారా బరేలిన్‌ తెలిపారు.

ఇదీలావుంటే.. గ్రామీ పురస్కార గ్రహీత, అమెరికాకు చెందిన ప్రముఖ గాయకుడు జో డిఫ్ఫే కరోనా వైరస్‌తో మరణించాడు. కొవిడ్‌-19 కారణంగా జో మరణించాడని ఆయన అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో ప్రకటించారు. చనిపోవడానికి రెండు రోజుల క్రితమే తనకు కొవిడ్‌-19 కొవిడ్‌ ఉన్నట్లు జో డిఫ్ఫే ప్రకటించాడు.