సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఎవరు ఏ ఆపదలో ఉన్న స్పందించే పవన్..ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో దానిని తరిమికొట్టే ప్రయత్నాల్లో భాగంగా పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలకు విడిగా భారీ సాయాన్ని ప్రకటించారు. ఒక్కో రాష్ట్రానికి రూ.50లక్షల చొప్పున.. రెండు రాష్ట్రాలు కలిపి రూ.కోటిని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తానని తెలిపారు.
ఇక ఇప్పుడు తెలిపినట్లే ఆ చెక్ ను రెండు ప్రభుత్వాలకు పంపినట్లు ట్విట్టర్ లో పోస్ట్ చేసారు. ‘కరోనా వైరస్ పై యావత్ భారతదేశం చేస్తున్న పోరాటానికి మనవంతు ఆర్థిక చేయూతను అందిద్దాం. మరింత బలంగా కరోనా వ్యాప్తి నియంత్రణ కోసం పోరాడేందుకు ప్రధానిమంత్రికి చేయూతను అందించి మన నైతిక బాధ్యత నిర్వర్తిద్దాం.’ అని తెలిపారు.
Rs.50 lakh been transferred to Telangana CM releif fund as a part of my Rs.2 crore commitment to fight against covid-19 pandemic @TelanganaCMO @KTRTRS @BJP4Telangana @JanaSenaParty pic.twitter.com/iU3C6LVHVi
— Pawan Kalyan (@PawanKalyan) April 3, 2020