బాలయ్య విరాళం ఫై చిరు స్పందన..

కరోనా మహమ్మారి తో అష్టకష్టాలు పడుతున్న ప్రజలకు తనవంతు సాయం అందజేశారు సినీ నటుడు , ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. శుక్రవారం ఉదయం కరోనాపై పోరాటానికి 1 కోటి 25 లక్షల రూపాయల భారీ విరాళం ప్రకటించి తన మంచి మనసు చాటుకున్నారు. అందులో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం సహయనిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయనిధికి అందజేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఎంతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం 25 లక్షల రూపాయల చెక్‌ను కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి కళ్యాణ్‌కు అందించారు.

ఈ సందర్బంగా మెగా స్టార్ చిరంజీవి బాలకృష్ణ ఫై ప్రశంసల జల్లు కురిపించారు. ప్రతి కష్టసమయంలోనూ ప్రజలను ఆదుకోవడం కోసం సినీ పరిశ్రమ ఒక్కటిగా ముందుకొస్తే మీరెప్పుడూ తోడుంటారు. కరోనా క్రైసిస్‌తో ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకునేందుకు ఏర్పాటు చేసిన ‘కరోనా క్రైసిస్ ఛారిటీ (CCC)కి రూ. 25 లక్షలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ. 50 లక్షలు, తెలంగాణ ప్రభుత్వానికి రూ. 50 లక్షలు ఆర్ధిక సాయాన్ని ప్రకటించారని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు చిరు. ఈ సందర్బంగా ‘కరోనా క్రైసిస్ ఛారిటీ (CCC)కి అందించిన రూ. 25 లక్షల చెక్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు చిరంజీవి. ఈ చెక్‌పై కరోనా క్రైసిస్ ఛారిటీతో పాటు చిరంజీవి ఛారిటిబుల్ ట్రస్ట్ అని కూడా రాసి ఉండటం విశేషం.