దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వైరల్ గా ఉండడం తో మోడీ సర్కార్ మార్చి 24 నుండి ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితం అయ్యారు. అయినప్పటికీ రోజు రోజుకు అన్ని రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న వేళ మోడీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
ఈ కాన్ఫరెన్స్ లో అనేక విషయాల గురించి మాట్లాడినట్లు సమాచారం. ఏప్రిల్ 14 తరువాత లాక్ డౌన్ విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దశలవారీగా ఎత్తివేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, లాక్ డౌన్ తరువాత పరిస్థితి ఏంటి అనే దానిపై రూట్ మ్యాప్ తయారు చేయాలని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని సూచించారు. అయితే, రేపు ఉదయం 9 గంటలకు ప్రధాని మోడీ జాతిని ఉద్దేససించి ఓ చిన్న వీడియో సందేశాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ సందేశాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేయబోతున్నారు. రేపు వీడియో సందేశం ఎలా ఉండబోతుంది.. ఏమని మోడీ మాట్లాడతారు అనేది చూడాలని అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు.