దిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యుడికి కరోనా


దిల్లీలోని ఎయిమ్స్‌ వైద్యుడికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఎయిమ్స్‌లోని ఫిజియాలజీ విభాగంలో పనిచేస్తున్న వైద్యుడికి వైరస్‌ సోకినట్లు అధికారులు గుర్తించారు. ప్రత్యేక విభాగంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అప్రమత్తమైన అధికారులు ఆయన కుటుంబ సభ్యులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించే పనిలో పడ్డారు

ఇదీలావుంటే మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా ముంబయిలోని ధారవిలో రెండో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. 52 ఏళ్ల బీఎంసీ పారిశుద్ధ్య కార్మికుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.