కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకొనేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే కొందరు మాత్రం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. లాక్‌డౌన్ అమలును ఉల్లంఘించే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చని రాష్ట్రాలకు సూచించింది.
ఇదీలావుంటే కరోనా వైరస్ ప్రభావం దృష్ట్యా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.