భారత్ లో కరోనా పరిస్థితి ఏంటి ?


భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 1965 కేసులు నమోదయ్యాయి. ఈ మహమ్మారి బారిన పడి 150 మంది బాధితులు కోలుకోగా.. 50 మంది మృతిచెందారు.

24 గంట్లలో దేశంలో 328 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా.. 151 మంది కోలుకున్నారనీ.. 12 మరణాలు చోటుచేసుకున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇదీలావుంటే. ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ ఉదయం 9గంటల తర్వాత మరో ముగ్గురికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 135కి చేరింది.