రూ. 200.11 కోట్ల విరాళం ఇచ్చిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరు సాయం అందిస్తున్నారు. కరోనా కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన వారికోసం తమవంతు గా సినీ , రాజకీయ , క్రీడా , బిజినెస్ ఇలా ప్రతి ఒక్కరు ఆర్ధిక సాయం అందిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 200.11 కోట్ల విరాళం ఇచ్చి తమ పెద్ద మనసు చాటుకున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి .

గురువారం మధ్యాహ్నం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖ ఉద్యోగులు విరాళం చెక్కులను సీఎం జగన్‌కు పెద్దిరెడ్డి అందజేశారు. పంచాయతీ రాజ్, మైనింగ్ నుంచి మొత్తం 200.11 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించామని మంత్రి తెలిపారు. కరోనా కట్టడికి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని.. కరోనాను ఎదుర్కోవడంలో ముఖ్యమంత్రికి అందరూ సహకరించాలని కోరారు.