గాంధీ ఆసుపత్రి దాడి ని తీవ్రంగా ఖండించిన మంత్రి ..

నిన్న గాంధీ ఆసుపత్రిలో డాక్టర్స్ ఫై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా వైరస్‌ బాధితుడు బుధవారం బాత్‌రూమ్‌లో జారిపడి మృతి చెందాడు. అయితే అతడి చావుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బాధితుడి బంధువులు డ్యూటీలో ఉన్న జూనియర్‌ డాక్టర్లపై, సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి దిగారు. ఐసోలేషన్‌ వార్డులోని కిటికి అద్దాలు ధ్వంసం చేశారు. కుర్చీలు, ఇతర ఫర్నిచర్‌ను చెల్లాచెదురు చేశారు.

ఈ ఘటన పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇక, డాక్టర్ల పై దాడి చేయడం హేయమైన చర్యగా మండిపడిన మంత్రి.. మార్కజ్ వెళ్లి వచ్చిన వాళ్ళను గుర్తించాము. ఇంకా ఎవరైనా ఉంటే డాక్టర్లను సంప్రదించాలి అని సూచించారు. గాంధీ ఆస్పత్రి ముందు ఉండే అభాగ్యులకు షెల్టర్ కల్పించాము..గాంధీలో పని చేస్తున్న వైద్య సిబ్బందికి ప్రభుత్వం రక్షణ కల్పింస్తుంది అని హామీ ఇచ్చిన తలసాని. మంత్రి కేటీఆర్‌ సైతం సీరియస్‌ అయ్యారు.

గురువారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందించారు. ఇటువంటి ఘటనలను సహించేది లేదని తేల్చిచెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ‘ ఇటువంటి వ్యక్తులు కేవలం మూర్ఖులే కాదు! వారి వల్ల ఇతరులకు కూడా ప్రమాదమే’నంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.