అపరకుబెరుడు, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ఓ సుచున చేశారు. అమెరికా వ్యాప్తంగా పది వారాల పాటు షట్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని, లేకుంటే తీవ్ర ఆర్థిక సంక్షోభం తప్పదని సూచించారు. దేశంలో కరోనా కేసులు 2 లక్షలకు చేరిన నేపథ్యంలో ఆయన తన అభిప్రాయం పంచుకున్నారు.
” కరోనా విషయంలో ఎవరినీ నిందించకుండా, దేశవ్యాప్త షట్ డౌన్ ను అమలు చేయాలి. చాలా రాష్ట్రాల్లో బీచ్ లు ఇంకా తెరచుకునే ఉన్నాయి. రెస్టారెంట్లు పని చేస్తున్నాయి. ప్రజలు స్వేచ్ఛగా ప్రయాణిస్తున్నారు. వారిలానే వైరస్ కూడా వ్యాపిస్తోంది. దీన్ని అడ్డుకోవాలంటే షట్ డౌన్ ఒక్కటే మార్గం” అని ఆయన అన్నారు.