కరోనా దెబ్బ.. యుఎస్ జాబ్స్ పాయె..

కరోనా వైరస్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతోంది. అమెరికాలోని పలు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతుండడంతో.. అక్కడ ఉద్యోగం ఆపదలో పడింది.
కరోనా వైరస్‌ తీవ్రత తగ్గిన తరువాత అన్ని స్థాయిల్లో కలిపి అమెరికాలో పని చేస్తున్న అన్ని దేశాలకు చెందిన వారిలో సుమారు 3.5 కోట్ల మంది ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రధానంగా హెచ్‌1బీ వీసాపై తాత్కాలికంగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కంపెనీల ఆర్థిక సమస్యలతో ఉద్యోగాలు ఉంటాయా? లేదా? అన్నది స్పష్టత కొరవడింది. ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని కంపెనీలు నిర్ణయిస్తే అక్కడ ఉండటం కూడా సమస్యగా మారుతుంది.