చైనా పై ట్రంప్ భారీ డౌట్

మెరికా అధ్యక్షడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి చైనాపై మండిపడ్డారు. కరోనా వైరస్‌ పుట్టుకకు కారణమైన చైనా కంటే అమెరికాలో బాధితుల సంఖ్య అధికంగా నమోదవ్వడంతో ట్రంప్‌ సందేహం వ్యక్తం చేశారు.

వైరస్‌ బాధితులు, మృతుల సంఖ్యలో బీజింగ్‌ గోప్యత పాటించిందనే విషయాన్ని ఇంటెలిజెన్స్‌ నివేదికలో వెల్లడిస్తూ.. చట్ట సభ్యులు గుర్తించిన అనంతరం ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. చైనా లెక్కలు నిజమనే విషయం మనకెలా తెలుస్తుందని ప్రశ్నించారు. చైనా చెప్పిన లెక్కలకన్నా ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.

కాగా అమెరికాలో ఇప్పటివరకు 1,43,000 మందికిపైగా వైరస్‍ బారినపడ్డారు. 2,500 మందికిపైగా మృత్యువాతపడ్డారు. న్యూజెర్సీలో 13,000 కరోనా కేసులు నమోదు కాగా, 160 మంది మరణించారు.