అర్చకుల మధ్యలోనే శ్రీరాముడి కళ్యాణం

భద్రాచలం లో రామయ్య కళ్యాణం అంటే దేశ వ్యాప్తంగా భక్తులు తరలివస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం కరోనా దెబ్బ కు భక్తులు లేకుండానే శ్రీ రాముడి కళ్యాణం జరుగుతుంది. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజ్ర్బిస్తుండడంతో ఈసారి భక్తులను అనుమతించలేదు.

అలాగే మిథిలా స్టేడియంలో ఆరుబయట నిర్వహించాల్సిన శ్రీరామనవమి వేడుకలను ఆలయ ప్రాంగణంలోనే ప్రాకార మండపంలో జరుపుతున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కల్యాణం అనంతరం శ్రీరామనవమి మరుసటి రోజున ఆగమశాస్త్రం ప్రకారం పట్టాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పట్టాభిషేకం కూడా ప్రాకార మండపంలోనే నిర్వహిస్తారు. ప్రతి ఏడూ రాముడి కళ్యాణం కన్నులారా చూసే భక్తులు ఈసారి మాత్రంటీవీల్లో చూసి తరించిపోవాలి.