ప్రపంచం మొత్తం కరోనా వైరస్ వణికిస్తున్న కానీ టిక్ టాక్ పిచ్చి మాత్రం తగ్గడం లేదు. ఆఖరుకు ఐసోలేషన్ వార్డులో కూడా టిక్ టాక్ వీడియో చేసి సంచలనం సృష్టిచింది ఓ యువతీ. అరియలూర్ జిల్లాకు చెందిన ఓ యువతి (25) చెన్నైలో ఓ షాపింగ్ మాల్‌లో పనిచేస్తోంది. ఖాళీ దొరికినప్పుడల్లా టిక్‌టాక్‌తో కాలక్షేపం చేయడం ఆమెకు సరదా. ఇటీవల ఆమె జ్వరం, దగ్గు లక్షణాలతో ఆస్పత్రిలో చేరింది. పరీక్షించగా మార్చి 26న కరోనా పాజిటివ్‌గా తేలింది. నాటి నుంచి ఆమెను అరియలూర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
ఐసోలేషన్ వార్డులో ఉన్నప్పటికీ ఆమె టిక్ టాక్ పిచ్చి తగ్గించలేదు.ఓ బాధాకరమైన పాట ఎంచుకొని కరోనాతో తాను ఎలాంటి తిప్పలు పడుతున్నానో వివరించింది. ఆ వీడియో చేయడానికి వార్డులోని ముగ్గురు సిబ్బంది కూడా సహకరించారు. ఈ వీడియో కాస్త వైరల్‌గా మారడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఆమెకు సహకరించిన ముగ్గురు పారిశుద్ధ్య సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. వారిని వెంటనే క్వారంటైన్‌కు తరలించారు.
ఒంటరిగా ఉండటంతో ఏమీ తోచట్లేదని.. అభిమానులను మిస్సవుతున్నానని సదరు యువతి తన టిక్‌టాక్ వీడియోలో పేర్కొంది.