సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు’ ఫేమ్ అంజలి తెలుగు , తమిళ్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. కెరియర్ ముందుకు సాగుతున్న నేపథ్యంలో హీరో జై తో ప్రేమాయణం సాగించి కెరియర్ ను పోగొట్టుకుంది. ఇద్దరు పెళ్లి చేసుకుంటారు అని అనుకున్న నేపథ్యంలో వీరిద్దరూ విడిపోయి పెద్ద షాకే ఇచ్చారు. జై నుండి దూరమయ్యాక అంజలి మళ్లీ సినిమాల ఫై ఫోకస్ పెట్టింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తనను బాధపెట్టిన మాటల గురించి చెప్పుకొని బాధపడింది. ‘‘భగవంతుని దయ వల్ల సినిమాల ఫ్లాపులు నన్ను పెద్దగా బాధపెట్టలేదు. నా సినిమాలన్నీ మినిమమ్ గ్యారంటీతో ఆడినవే! సో…సినిమాల పరంగా ఎప్పుడూ బాధపడలేదు. కానీ గతంలో మా ఫ్యామిలీలో కొన్ని సమస్యలు వచ్చి అవి అందరి నోళ్ళల్లోనూ బాగా నానాయి. ఆ సమయంలో నన్ను ఓదార్చినవారి కన్నా, నా పనైపోయిందని అన్నవారే ఎక్కువ. నాతో సన్నిహితంగా ఉండేవారు కూడా అలాంటి మాటలు మాట్లాడడం నాకు చాలా బాధగా అనిపించింది. అది తప్ప సినిమాల్లోకి వచ్చిన తరువాత నేను రంగంలో హ్యాపీగానే ఉన్నాను..’’ అని అంజలి చెప్పుకొచ్చింది.