కరోనా కు రామోజీ రూ. 20 కోట్ల సాయం..

కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరు సాయం అందిస్తున్నారు. కరోనా కారణంగా ఆర్ధికంగా నష్టపోయిన వారికోసం తమవంతు గా సినీ , రాజకీయ , క్రీడా , బిజినెస్ ఇలా ప్రతి ఒక్కరు ఆర్ధిక సాయం అందిస్తూ తమ గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు కరోనా నియంత్రణకు ఈనాడు గ్రూప్స్ తరుపున రూ. 20 కోట్ల విరాళం అందించారు.

తెలుగు రాష్ట్రాలకు రూ.10 కోట్ల చొప్పున.. మొత్తం రూ.20 కోట్ల విరాళం అందించారు. ఈ సాయాన్ని రెండు రాష్ట్రాల సీఎం సహాయ నిధి ఖాతాలకు బదిలీ చేశారు. అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆ సంస్థ ఛైర్మన్ రామోజీరావు లేఖలు కూడా రాశారు.

రామోజీ రావు విరాళానికి జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం చేపట్టే సహాయ, పునరావాస కార్యక్రమాలకు ఈ విరాళం ఉపయోగపడుతుందని.. కరోనా వంట సంక్షోభ సమయంలో మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు.