కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమ మూతపడింది. గత కొన్ని రోజులుగా షూటింగ్స్ ఆగిపోవడం తో ఇండస్ట్రీ నే నమ్ముకున్న సినీ కార్మికుల కష్టాలు అన్నీఇన్నీ కాదు..రోజు కూలి చేస్తే కానీ డొక్కాడని పరిస్థితిలో షూటింగ్స్ బంద్ కావడం తో వారి జీవిత రోడ్డున పడింది.
ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు చిత్ర సీమా నడుం బిగించింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆర్ధిక సాయాన్ని అందజేస్తుండగా..తాజాగా మెగాస్టార్ చిరంజీవి మనకోసం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ చారిటి ద్వారా సినీ కార్మికులను ఆదుకునే పని చేస్తున్నారు.
ఇప్పటికే ఈ ఛారిటీకి చాలామంది తమవంతు విరాళాలు ప్రకటించగా..తాజాగా దేవాకట్టా దీనిపై స్పందించారు. టాలీవుడ్ ప్రముఖులందరూ విరాళాలు ప్రకటించడం మంచి విషయం. కొందరు విరాళాలు ప్రకటించినప్పటికీ దాన్ని పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం లేకనో ఇంకేదైనా కారణం చేతనో వాళ్ళు బయటకి చెప్పరు. అంత మాత్రానా వాళ్ళని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఛారిటీ అనేది సామాజిక బాధ్యతగా వసూలు చేసే రౌడీ మాములు కాదు అంటూ ట్వీట్ చేసాడు. ప్రస్తుతం ఈయన చేసిన ట్వీట్స్ ఫై విమర్శలు వెల్లువెత్తున్నాయి.