ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సరికొత్త పద్దతికి శ్రీకారం చుట్టారు. ‘కోవిడ్ అలర్టింగ్ ట్రాకింగ్ సిస్టమ్’తో హోమ్ క్వారంటైన్‌లో ఉన్న వారి కదలికలను గుర్తించబోతున్నారు.
దేశంలోనే తొలిసారిగా ఈ తరహా సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది ఏపీ సాకర్. దీన్ని స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ తయారు చేసింది. విదేశాల నుంచి వచ్చిన వారిని 14 రోజుల పాటు హోమ్ క్వారంటైన్‌లో ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశించినప్పటికీ దాన్ని పట్టించుకోకుండా బయట తిరుగుతున్నారు. దీంతో వారిపై నిఘా పెట్టేందుకు ఈ ట్రాకింగ్ సిస్టంను వాడుకోనుంది. ఈ పరికరం ఒకేసారి 25 వేల మంది కదలికలను ఇది పసిగట్టగలదు. ఇప్పటి దాకా ఇలాంటి వ్యవస్థను దేశంలోని ఏ రాష్ట్రం కూడా వాడలేదు.