దేశంలో త్వరలోనే ఎమర్జెన్సీ వార్తల ఫై భారత సైన్యం క్లారిటీ

ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ నుండి దేశంలో ఎమర్జెన్సీ విధిస్తారని ..భారత సైన్యం చేతులో దేశం వుండబోతుందనే వార్తలు సోషల్ మీడియా లో వైరల్ కావడం తో భారత సైన్యం క్లారిటీ ఇచ్చింది.

ఈ మహమ్మారిని ఎదిరించేందుకు మాజీ సైనికులు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ సేవలను సైతం కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకోవడం లేదని వెల్లడించింది. ‘సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఏప్రిల్‌ నెల మధ్యలో దేశంలో అత్యయిక స్థితి విధిస్తారడం అవాస్తవం’ అని ఏడీజీపీఐ తెలిపింది.

ఇక కరోనా విషయానికి వస్తే దేశంలో అన్ని రాష్ట్రాలలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. మరణాల సంఖ్య తో పాటు పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతుంది. దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్నప్పటికీ కరోనా మాత్రం కట్టడి కావడం లేదు.