కరోనా వైరస్ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది. ఈ క్రమంలో చిత్ర పరిశ్రమ మూతపడింది. గత కొన్ని రోజులుగా షూటింగ్స్ ఆగిపోవడం తో ఇండస్ట్రీ నే నమ్ముకున్న సినీ కార్మికుల కష్టాలు అన్నీఇన్నీ కాదు..రోజు కూలి చేస్తే కానీ డొక్కాడని పరిస్థితిలో షూటింగ్స్ బంద్ కావడం తో వారి జీవిత రోడ్డున పడింది.
ఈ నేపథ్యంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు చిత్ర సీమా నడుం బిగించింది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆర్ధిక సాయాన్ని అందజేస్తుండగా..తాజాగా మెగాస్టార్ చిరంజీవి మనకోసం అనే కార్యక్రమాన్ని చేపట్టారు. చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ ఛారిటీ (సి.సి.సి.) ‘మనకోసం’ను ప్రారంభించారు. ఈ చారిటి ద్వారా సినీ కార్మికులను ఆదుకునే పని చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది తమవంతు సాయం ప్రకటించగా తాజాగా .. నటుడు సుశాంత్ రూ.2 లక్షలు , సందీప్ కిషన్ రూ. 3 లక్షలు , ‘టక్ జగదీష్’ సినిమాను నిర్మిస్తున్న సాహు గారపాటి, హరీష్ పెద్ది కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం రూ. 5 లక్షలు , సమీర్ రెడ్డి, మూరెళ్ల ప్రసాద్ నేతృత్వంలోని తెలుగు సినిమాటోగ్రఫర్స్ అసోసియేషన్ రూ. 50 వేలు విరాళాన్ని ప్రకటించారు.